ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షకు పాటుపడాలి - బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి క్ర్రపాకర్

ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షకు పాటుపడాలి - బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి క్ర్రపాకర్
  • సూర్యాపేట అభివృద్ధి లో మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి పనిచేద్దాం
  • మరొకసారి బిఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావాలి.  విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని మరొకసారి గెలిపిద్దాం

ముద్ర ప్రతినిధి సూర్యాపేట : పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ క్ర్రషి చేయాలని బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు, పట్టణ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి క్ర్రపాకర్ అన్నారు. చెట్లు లేకపోతే కాలుష్యం పెరిగి, ఆక్సిజన్ బదులుగా కార్బన్ డయాక్సైడ్ పీల్చవలసిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.  సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్ 45 వ వార్డులో హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి వద్ద మొక్కలు నాటాలని అన్నారు.  సూర్యాపేట అభివృద్ధి ప్రధాత, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని మరొకసారి సూర్యాపేట శాసనసభ్యులుగా గెలిపించుకోవాలని ఆయన అన్నారు. సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటె మరొకసారి రాష్ట్రంలో బిఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి గా కెసిఆర్, మంత్రిగా జగదీష్ రెడ్డి రావాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో సయ్యద్ సలీం రాష్ట్ర మైనారిటీ నాయకులు, వెంపటి రాము, రుద్రంగి  సత్యనారాయణ, లోడె సతీష్, కోమటి చంద్రశేఖర్, సుప్రియ,  ఆర్ పి పల్స విజయ, ఉపేంద్ర చారి, వసీమ్ హర్దార్ హరితహారం, కుక్కడపు సాలయ్య, సందీప్, మ్ర్రదులగర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.