గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపు కోసం పనిచేస్తాం - రైతులు 

గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపు కోసం పనిచేస్తాం - రైతులు 

ముద్ర,శాయంపేట : వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి బిఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చిన రైతులు.సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి చొరవతో గండ్ర దంపతుల సహకారంతో చిన్న బ్రిడ్జి పక్కన రైతులు వ్యవసాయం కోసం వెళ్లే రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. దీనితో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ, మాకు ఇంత వరకు ఏ నాయకులు  దారికి సహకరించలేదు, మేము విషయం  చెప్పిన వెంటనే మాకు దారి కల్పించిన సర్పంచ్ రాజిరెడ్డి కి, గండ్ర దంపతులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎన్నికల్లో గండ్ర వెంకటరమణరెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు.