రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకుల మృతి

రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకుల మృతి

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి జిఎం కార్యాలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకులు దుర్మరణం చెందారు. గురువారం ద్విచక్ర వాహనంసై వెళ్తున్న తండ్రి, కొడుకుల ద్విచక్రవాహనంను ట్రాక్టర్ ఢీకొనడంతో ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి , కొడుకులు మృతి చెందగా తల్లికి తీవ్ర గాయాలు అయ్యాయి.  మృతులు మందమర్రి మండలం శంకర్ పల్లి కి గ్రామస్తులుగా భావిస్తున్నారు.