రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువుల పంపిణీ చేయాలి: కలెక్టర్

రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువుల పంపిణీ చేయాలి: కలెక్టర్

ఎరువుల దుకాణంలు, రైతు సేవా సహకార కేంద్రం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కర్ణన్

ముద్ర ప్రతినిధి, నల్లగొండ: వచ్చే యాసంగి సీజన్ కు కూడా రైతులకు ఎరువుల ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ దుకాణ దారులకు సూచించారు. నల్గొండ జిల్లా కొండమల్లే పల్లి మండల కేంద్రంలో ఓ ఎరువుల దుకాణంను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూరియా, కాంప్లెక్స్ ఎరువుల నిల్వ, అమ్మకాలు ఈ  పాస్ యంత్రంలో నమోదు వివరాలు, దుకాణం, గోదాంలో స్టాక్ పరిశీలించారు. ప్రస్తుతం యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, పొటాష్ అందు బాటులో ఉన్నట్లు, యూరియా కు ఎటువంటి ఇబ్బంది లేదని దుకాణం యజమాని కలెక్టర్ కు వివరించారు. ఎరువులు ఎంత రేటుకు అమ్ముతున్నారని దుకాణ దారులను అడిగి తెలుసుకున్నారు. వచ్చే  యాసంగి సీజన్ కు కూడా ఎరువులు రైతులకు ఇబ్బంది౫ లేకుండా పంపిణీ చేయాలని సూచించారు. అమ్మకాలు జరిపిన వెంటనే ఆన్ లైన్ లో అప్డేట్ చేయాలన్నారు. అనంతరం రైతు సేవా సహకార కేంద్రం తనిఖీ చేసి ఎరువులు స్టాక్, అమ్మకాలు పరిశీలించారు. రైతులకు అవసరమైన ఎరువులు ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాలని సూచించారు.