స్నేహితుని కుటుంబానికి చేయుత

స్నేహితుని కుటుంబానికి చేయుత
  • 50 వేల ఆర్థిక సహాయం అందజేత

ముద్ర,పానుగల్:- పానుగల్ మండలం రేమొద్దుల గ్రామంలో ఈనెల 11వ తేదిన పిట్టల కాశయ్య అనేవ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు.మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతునికి గ్రామంలో సొంత ఇల్లు కూడా లేకపోవడంతో అతని చిన్ననాటి స్నేహితులు 2009-2010 విద్యా సంవత్సరానికి చెందిన పదవతరగతి మిత్రులందరు కలిసి కాశయ్య కూతురు పేరిట పోస్టఫీస్ లో 50వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచారు. మిత్రుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మిత్ర బృందం పాల్గొన్నారు.