విశాఖ బీచ్‌ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం

విశాఖ బీచ్‌ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం

విశాఖ బీచ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బీచ్ రోడ్డులో ఉన్న డైనో పార్కులో ఈ ఘ‌ట‌న నేటి ఉద‌యం చోటు చేసుకుంది.. డైనో పార్క్ లోని రెస్టో కేఫ్ లో చెల‌రేగిన మంట‌ల‌తో రెస్టారెంట్ పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

భారీ అగ్నికీలల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిప్రమాదంతో సమీప ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెదురు బొంగులు, ఇతర కలప నిర్మించిన పార్క్ కావడంతో మంటలను అదుపు చేయడం సవాల్ గా మారింది. ఈ ప్ర‌మాదంతో ఎవ‌రికీ ఎటువంటి గాయాలు కాక‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.