భువనగిరి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ 

భువనగిరి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ 

ముద్ర ప్రతినిధి భువనగిరి : భువనగిరి జిల్లా కేంద్రం లోని ప్రిన్స్ చౌరస్తా బాబు జగజ్జీవన్ రాం విగ్రహం వద్ద భువనగిరి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో మత గురువు మౌలానా ఫెరోజ్ జెండా ఆవిష్కరణ  చేశారు. ఈ సందర్బంగా ముస్లిం జేఏసీ నాయకులు జహంగీర్, హమీద్ పాషా, అతహర్, సలాఉద్దీన్, ఇంతియాజ్ మాట్లాడుతూ భారతదేశం కొరకు ప్రాణాలర్పించిన ప్రతీ ఒక్కరిని స్మరించుకున్నారు . భారతదేశంలో ఎన్నో మతాలు, ఎన్నో కులాల వారు కలిసి మెలిసి ఉండడమే దేశ గొప్పతనమని అన్నారు. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయ్ ఇలా ప్రతీ ఒక్కరి రక్తం తో ఈ దేశ భూమి తడిస్తేనే మనకు స్వాతంత్రం వచ్చిందని గుర్తుచేశారు. కానీ ఈరోజు కొన్ని మతోన్మాద శక్తులు భారతదేశం లో మతాల పేరుతో రాజకీయం చేస్తూ దేశం లో ఆశాంతిని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నాయని దానిని ప్రతీ ఒక్కరూ తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.స్వాతంత్ర ఉద్యమం లో జైహింద్, ఇంకలాబ్ జిందాబాద్ అనే నినాదాలు తీసుకువచ్చిందే ముస్లిం లని, ఎంతో మంది ఉలేమాలు దేశం కోసం ప్రాణ త్యాగం చేశారని గుర్తుచేసారు. దేశం కోసం ప్రాణాలు అర్పియ్యడం కొరకు ముస్లిం లు ఎప్పటికైనా సిద్దమేనని అన్నారు. ఈ కార్యక్రమం లో హఫీజ్ , మొయిన్,జావీద్ ఖాద్రి,కుడుదుల నగేష్, పోతాంశెట్టి వెంకటేష్,అమీన్, నయీమ్,షరీఫ్, హరూన్, ముళ్తాని,అశ్వాక్, ఖమర్, మజహార్, అవేస్ చిష్టి,ఇస్తియాక్, బాబా,ఆమెర్,సలీం అజర్, ఇంతియాజ్,ఖలీద్, ఉబైద్,అసద్, వసీమ్, వాహేద్  పాల్గొన్నారు.