వరద గుప్పెట్లో మణుగూరు పట్టణం

వరద గుప్పెట్లో మణుగూరు పట్టణం

తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరుపు లేకుండా పడుతున్న వానలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో వదర నీరు ఇళ్లను చుట్టూ ముట్టాయి.

రాత్రి కురిసిన భారీ వర్షంతో మణుగూరులో కనీవిని ఎరుగని రీతిలో జలప్రళయం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పోలీస్, రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.మణుగూరు పట్టణ ప్రధాన రహదారి పై పెట్రోల్ బంక్ ఏరియా చెరువు లాగా మారింది. కట్టవాగు, కోడిపుంజుల వాగు ప్రమాదకర స్థితిలో ప్రవాహిస్తోంది. దీంతో మెయిన్ రోడ్ పైనే భారీ నీరు చేరింది. దీంతో ప్రజలు ఎటు వెళ్లలేకపోతున్నారు.

అధికారులు పలు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న ఇద్దరు గర్భిణీలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రధాన రహదారి అయిన వేణు రెస్టారెంట్ వద్ద వరద భారీగా చేరింది. మోకాలు కంటే ఎక్కువ స్థాయిలో నీరు నిల్వ ఉంది.దీంతో ఆ దారిలో పోలీసులు రాకపోకలను బంద్ చేశారు. ప్రత్యామ్నాయ మార్గాల గుండా ప్రజలను పంపుతున్నారు.

బాలాజీ నగర్, కుంకుడు కాయల చెట్ల గుంపు, గాంధీనగర్, కాళీమాత ఏరియా ఆదర్శనగర్, సుందరయ్య నగర్, ఆదర్శనగర్, వినాయక నగర్, చేపల మార్కెట్ ప్రాంతం నీటిలో మునిగిపోయాయి. వర్షాల నేపథ్యంలో కలెక్టర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రెవెన్యూ, వైద్య, మున్సిపల్, పోలీసులు అందురూ విధుల్లో ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించింది.