మంత్రి జగదీష్ రెడ్డి ని మళ్లీ గెలిపించాలి

మంత్రి జగదీష్ రెడ్డి ని మళ్లీ గెలిపించాలి
  • అభివృద్ధి చేసే వారిని ఆదరించాలి
  • బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ ఆధ్వర్యంలో   కొత్త బస్టాండు ఫ్లై ఓవర్ వద్ద అల్పాహారం పంపిణీ

ముద్ర ప్రతినిధి సూర్యాపేట : ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రధాత, సూర్యాపేట ను అన్నిరంగాలలో అభివృద్ధి చేస్తున్న సూర్యాపేట శాసనసభ్యులు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని మళ్లీ ఎమ్మెల్యే గా గెలిపించాలని బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు, పట్టణ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ అన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి స్ఫూర్తితో ప్రజలకు తన వంతు సేవ చేయాలనే ఆశయంతో సూర్యాపేట పట్టణంలో  పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు, పట్టణ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు, జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ ఆధ్వర్యంలో  గండూరి రామస్వామి జానకమ్మ, గండూరి సత్యనారాయణ, గండూరి జోనాల జ్ఞాపకార్థం    నిర్వహిస్తున్న 365 రోజుల పాటు ప్రతి రోజు ఉదయం అల్పాహారం పంపిణీ కార్యక్రమంలో భాగంగా 
కొత్త బస్టాండు ఫ్లై ఓవర్ వద్ద మంగళవారం ఉదయం 300 మంది బాటసారులకు అల్పాహారం పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో గండూరి క్ర్రపాకర్ మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు క్యాబినెట్ సమావేశంలో ఇటీవల వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం, వరదలలో మరణించిన వారికి ఆర్దిక సహాయం ప్రకటించిన సిఎం కెసిఆర్ కు ధన్యవాదములు తెలిపారు. 43 వేల మంది ఆర్టిసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ సిఎం కెసిఆర్ ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేశారని, 60 వేల కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాదు లో మెట్రో రైలు విస్తరణ పనులకు అనుమతి ఇచ్చిన సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ , మంత్రి జగదీష్ రెడ్డికి అభినందనలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో కలకోట లక్ష్మయ్య, రాచకొండ శ్రీనివాస్, బజ్జూరి శ్రీనివాస్, తెరటపల్లి సతీష్, మంచాల శ్రీనివాస్, సంగు నవీన్, చెప్పలపల్లి స్ఫూర్తి,, లోడె సతీష్ కుమార్, సంగిశెట్టి  వెంకటేష్, మృదులాకర్  కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.