శంషాబాద్ ఎయిర్ పోర్టులో  బంగారం, విదేశీ కరెన్సీ పట్టివేత నలుగురి అరెస్ట్

శంషాబాద్ ఎయిర్ పోర్టులో  బంగారం, విదేశీ కరెన్సీ పట్టివేత నలుగురి అరెస్ట్

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి :  శంషాబాద్ విమానాశ్రయంలో  బంగారం, విదేశీ  కరెన్సీని అక్రమంగా తరలిస్తున్న నలుగురు ప్రయాణికులను  కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం రాత్రి  దుబాయ్, కువైట్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ముగ్గురు  ప్రయాణికులు బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వారి లగేజీ తనిఖీ చేయగా,  ముగ్గురి నుంచి 1,657 గ్రాముల బంగారం లభిచింది. బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ దాదాపు రూ.99 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. బహ్రెయిన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడు విదేశీ కరెన్సీని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. రూ.13 లక్షల విలువైన ఫారిన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ  ఘటనలపై  కేసులు నమోదు  చేసి విచారణ చేస్తునట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.