పట్టు పట్టారు... కొలువు కొట్టారు..      

పట్టు పట్టారు... కొలువు కొట్టారు..      
  • స్థంభంపల్లిలో నలుగురిని వరించిన గురుకుల ఉద్యోగాలు
  • ఆనందంలో గ్రామస్తులు            

వెల్గటూర్, ముద్ర :  జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థులు పట్టుదలతో  చదివి "గురుకుల ఉద్యోగాలను" సాధించారు. కష్టాలను అధిగమిస్తూ, పట్టుదలతో చదివి ఉద్యోగాలను సాధించడం పట్ల స్థంభంపల్లి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..                

కాశ శ్రీనాత్ : ఒకవైపు ఉద్యోగం చేస్తూ, మరొకవైపు గురుకుల ఉద్యోగం సాధించాలన్న తపనతో కష్టపడి చదివి " కాశ శ్రీనాత్ " లైబ్రేరియన్ పోస్ట్ కు  ఎంపికయ్యాడు. కాగా కాశ శ్రీనాథ్ తల్లిదండ్రులు ఇతని చిన్నప్పుడే (నాలుగో తరగతి చదువుతున్న సమయం లో ) చనిపోగా తాతయ్య, నానమ్మల సంరక్షణలో  పెరిగాడు. కాగా 2018లో తపాల శాఖలో అసిస్టెంట్ పోస్ట్ మెన్ గా ఎంపికై భువనగిరి లో గల ప్రధాన తపాల కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. 2023లో గురుకుల ఉద్యోగాల నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసుకుని, ఉద్యోగం చేస్తూ కష్టపడి చదివి 109వ ర్యాంకుతో ఓపెన్ క్యాటగిలో లైబ్రేరియన్  ఉద్యోగం సాధించాడు.            

చల్లూరి యశోద: చల్లూరి యశోద  "ఫిజికల్ సైన్స్" లో టీజీటీగా ఎంపికాయ్యింది.. కాగా ఈమె ప్రస్తుతం వెల్లటూరు మండలంలోని కుమ్మరిపల్లెలో గల కస్తూర్బా పాఠశాలలో" పీజీ -సీఆర్టీ" గా విధులను నిర్వహిస్తుంది.

 కాశ "పద్మాంజలి, శ్రీధర్ :  ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఈమె లక్ష్యానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తోడైంది. దీనితో  హైదరాబాద్ వెళ్లి కొన్ని నెలలు శిక్షణ తీసుకుంది. ఉద్యోగం సాధించినాకే ఇంటికి వెళ్లాలని ఆమె పడ్డ శ్రమకు గుర్తింపుగా  టీజీటీ (సోషల్ )కి ఎంపికయ్యింది.  

హరి అఖిల: హరి అఖిల పట్టుదలతో చదివి మొదటి ప్రయత్నం లోనే "జేఎల్, డీ ఎల్"( ఫిజికల్ సైన్స్) పోస్టులకు ఎంపిక అయ్యింది.  కాగా వీ రందరూ కష్టపడి చదివి కొలువులు సాధించడం పట్ల గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు