తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన విధంగా ప్రజలకు ఉంది

తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన విధంగా ప్రజలకు ఉంది

కాకి దయాకర్ రెడ్డి విగ్రహాన్ని పెట్టనీయని గత పాలకుడు

కెసిఆర్ పేద ప్రజల జీవితాలను తాకట్టు పెట్టి అప్పులు చేశాడు

నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి

కాకి దయాకర్ రెడ్డి ఆశయాలు కొనసాగిస్తా రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి

బానిస సంకెళ్లు తెగిపోవాలి బ్రతుకులు మారాలి అనే నినాదంపై పని చేసిన వ్యక్తి కాకి దయాకర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: కత్తులతో పోరాటం చేసిన వ్యక్తి కాకి దయాకర్ రెడ్డి, ఆయన జీవితం భావితరాలకు ఆదర్శనీయం నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఆత్మకూరు మండలంలోని కాకి దయాకర్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడారు.ఒకవైపు అహంకార ధోరణి తో ఉన్న బి ఆర్ఎస్ పార్టీ.... ?కాంగ్రెస్ ప్రజల సంక్షేమానికి కృషి చేసిన పార్టీ అని బ్యాంకు నుంచి 6. 70 కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చిన ఘనుడు కేసీఆర్ అని అన్నారు. కరెంటు కంపెనీల అప్పు 81 వేల కోట్లుఉంది, నిజంగా రైతులకు ఇచ్చింది 10 నుంచి 12 గంటలు మాత్రమే సింగిల్ ఫేస్ కరెంటు ఇచ్చి 24 గంటల కరెంటు ఇచ్చామని గొప్పలు చెప్పుకున్నారు తప్ప నిజంగా కరెంటు ఇవ్వలేదన్నారు. ఇరిగేషన్ శాఖను.. ప్రపంచం మొత్తంలో భూతద్దంలో చూపించారని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ నుకమిషన్  ల కోసం కక్కుర్తి పడి నాసిరకం పనిచేసి కమిషన్ లు తీసుకున్నారని అన్నారు. సంవత్సరానికి 3 వేల కోట్లు కట్టాల్సి వస్తుందని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశారని, ఎస్ఆర్ఎస్పి కాలువకు ప్రస్తుతం నీళ్లు ఇవ్వలేని పరిస్థితి దాపురించింది...? బిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే ఇదంతా జరిగిందని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు.ఈ గ్రామానికి ఇచ్చినటువంటి స్టోన్ క్రషర్ విషయము ప్రభుత్వ భూముల ఆక్రమించే విషయము తప్పకుండా శిక్ష పడేవిధంగా ఉంటుంది.

కాకి దయాకర్ రెడ్డి కుటుంబం ఒక చరిత్ర గల కుటుంబం,నీతి నిజాయితీతో పని చేసిన కుటుంబం, అధికారం కావాలనుకుంటే గతంలో మంత్రి అయ్యేవాడు, అలాంటి నాయకుడు మనలో లేకపోవడం సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్న నాయకుడు, కుటుంబ సభ్యులను మర్యాదతో ఉండే వ్యక్తి దయాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆయన విగ్రహాన్ని కూడా పెట్టనీయకుండా చేసిన ఘనుడు అనంతరం దామోదర్ రెడ్డి మాట్లాడుతూ నాకు ఎంత అధికారం ఇచ్చారో నేను కూడా అదే విధంగా 6 గ్యారంటీ విషయంలో తూచా తప్పకుండా 48 గంటలలో రెండు గ్యారెంటీలను అమలు చేశామన్నారు. పది సంవత్సరాల నుంచి ఇండ్లు, రేషన్ కార్డులు లేవని, ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఇవన్నీ ఇస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.

రాష్ట్రాన్ని శాస్త్రీయంగా అద్భుతంగా బలపడే విధంగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ ఒక్కరికి సమస్య ఉంటే ఆ సమస్య తీర్చే విధంగా పనిచేస్తామన్నారు. న్యాయమైన సమస్యలను తప్పకుండా అమలు చేస్తామన్నారు.కాకి దయాకర్ రెడ్డి కుమారునికి, జార్జిరెడ్డి పేరు పెట్టిన ఘనత దయాకర్ రెడ్డిది అన్నారు.వీరులు కన్నా గడ్డ ఆత్మకూరు మండలం అని బానిస సంకెళ్లు తెగిపోయీ బ్రతుకుల మారాలి అనే నినాదంపై పనిచేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి విగ్రహంఏర్పాటు చేస్తామంటే కలెక్టర్ చేత ఆపించిన, మాజీ మంత్రి మానసిక వేదన గురిచేసి చావు కారణమైనాడు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్,తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్, కొప్పుల వేనారెడ్డి,చకిలం రాజేశ్వరరావు,కాకి జార్జి రెడ్డి, కాకి కృపాకర్ రెడ్డి, అనురాధ కిషన్ రావు, మండల పార్టీ అధ్యక్షులు సర్పంచులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం  సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి టిడిపి మండల పార్టీ అధ్యక్ష పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినారు.