ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు తీరును గమనిస్తున్న ప్రజానీకం

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు తీరును గమనిస్తున్న ప్రజానీకం
  • రైతు బంధు అడిగిన వారిని మంత్రి కోమటిరెడ్డి చెప్పుతో కొడతానన్నడం సంస్కారమేనా.
  • శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల ను కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల నల్గొండకు తీవ్ర నష్టం.
  • రూ.2 లక్షల రైతు రుణమాఫీ, పింఛన్ల పెంపు ఏమైంది.
  • తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష
  • మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి 
  • ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయనివారే రండ లవుతారు
  • తెలంగాణ జాతిపిత కెసిఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించడం అర్ధరహితం
  • ప్రజా సంక్షేమాన్ని మరిచిపోతే ప్రజలతో ఉద్యమిస్తాం
  • ఈనెల 13న నల్లగొండలో కెసిఆర్ సారధ్యంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలి
  • తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్

తుంగతుర్తి ముద్ర:- ఎన్నికల ముందు ఆర్భాటంగా ఓట్ల కోసం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు  బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లో  మాజీ ఎమ్మెల్యే తుంగతుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సమాయత్త సమావేశంలో పాల్గొని ప్రసంగించారు .ఈ సందర్భంగ జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాల  పంపిణీని కె ఆర్ ఎం బి కి అప్పగించటం  కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనమని  జగదీశ్ రెడ్డి  ధ్వజమెత్తారు. 

కృష్ణా జలాలపై కేంద్రం  పెతనంతో ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాలు సాగు, తాగునీరు కోసం కేంద్రం అనుమతి కోసం ఎదురు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల  కృష్ణ జలాల ట్రిబ్యునల్ వివాదం  ప్రధాని మోడీ తీర్చడానికి 9 ఏళ్లకు పైగా పట్టిందన్నారు. నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కృష్ణా జలాల విషయంలో  ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు తీర్చుకుంటాయని కేంద్రం తల దూర్చవద్దని కరాకండిగా మాట్లాడి పోరాడారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కరువుతో కొట్టుమిట్టాడుతుంటే ఒక్క తడి నీరు కోసం కెసిఆర్ కోదాడ నుండి నాగార్జునసాగర్ వరకు పాదయాత్ర చేశారని, కెసిఆర్ పోరాటానికి తలగ్గిన ప్రభుత్వం ఒక పంట నీరు విడుదల చేసిందని గుర్తు చేశారు. గత పది ఏళ్లలో సాగునీరు తాగునీరు తో పాటు నాణ్యమైన విద్యుత్ అందించామని తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కష్టాలు తెస్తుందన్నారు.  కెసిఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నామన్నారు .అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ పనితీరు బయటపడిందని విమర్శించారు. సాగునీటి విషయమై మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్పందించకపోవడం జిల్లా ప్రజలకు అన్యాయం చేసినట్లేనన్నారు. రైతుబంధు పడటం లేదని అడిగిన వారిని చెప్పుతో కొడతానని మంత్రి కోమటిరెడ్డి అనడం అహంకారానికి నిదర్శనం అన్నారు జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి పై మంత్రి పోలీసులతో దౌర్జన్యం చేయించడం సరికాదన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కార్యకర్తలు నాయకులు అంతా కష్టపడితే నల్లగొండ పార్లమెంటు సీటు బారాస దేనిని అన్నారు. అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామన్న రెండు లక్షల రుణమాఫీ పెంచుతామన్న పింఛన్లు హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆరు నూరైనా నూరు ఆరైనా ఈ నెల 13న నల్గొండలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేస్తామని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగ సభను అడ్డుకుంటామని టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎవరిని అడ్డంకులు సృష్టించిన సభకు హాజరవుతారని సభ ఘనవిజయమవుతుందని అన్నారు.

తుంగతుర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కెసిఆర్ ను ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అసభ్య పదజాలంతో మాట్లాడడం ఎంత మాత్రం సహితరాన్ని విషయమని అన్నారు .ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయని వారే రండలవుతారని అన్నారు .తెలంగాణ కోసం 14 సంవత్సరాల పోరాటం 10 సంవత్సరాలు పరిపాలన అందించి  తెలంగాణను సస్యశ్యామలం చేసి ఆకుపచ్చ తెలంగాణ గా మార్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని అన్నారు .దేశంలో మరి రాష్ట్రంలో అమలు గాని సంక్షేమ పథకాలు అమలు చేసి పేద ప్రజానీకాన్ని ఆదుకున్న ఘనత కేసీఆర్ దే అని అన్నారు. ఎన్నికల ముందు కల్లబొల్లి మాటలు చెప్పి అబద్ధాల మాటలతో వాగ్దానాలతో ప్రజలను మోసగించి నేడు అధికారంలోకి వచ్చాక వాగ్దానాలను ఒకటొకటిగా తుంగలో తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారని కానీ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుంటే తాము చూస్తూ ఊరుకోమని ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు .రానున్న పార్లమెంటు ఎన్నికల్లో  బిఆర్ఎస్ కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేసి పార్లమెంట్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

పార్లమెంటు ఎన్నికలోనే కాదు రానున్న సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల్లో సైతం సత్తా చాటాల్సి ఉందని మళ్లీ నియోజకవర్గంలో గులాబీ జెండా రెపరెపలాడించాలని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి జరిగింది అంటే కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే జరిగిందని అన్నారు. 2014 పూర్వం నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు నమోదు అయ్యాయో 2014 నుండి 2023 వరకు ఎన్ని కేసులు నమోదు అయ్యాయో ఒకసారి రికార్డులు చూసుకోవాలని అన్నారు .హింసాయిత వాతావరణాన్ని పూర్తిగా మార్చివేసి శాంతియుత వాతావరణంలో పచ్చని పైర్లతో తుంగతుర్తి నియోజకవర్గం కళకళలాడేలా చేసామని అన్నారు. గడిచిన నాలుగైదు సంవత్సరాలుగా కాలేశ్వరం జలలు ప్రతి చెరువు కుంటను అలుగులు పోసేలా నింపామని నేడు గోదావరి జల్లాలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు . విద్యుత్ కోత సాగునీటిలో కోత ఇదేనా కాంగ్రెస్ పాలన అని ప్రశ్నించారు. రానున్న కాలంలో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. నల్లగొండ బహిరంగ సభను టిఆర్ఎస్ కార్యకర్తలు విజయవంతం చేస్తారని ఆ దిశగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ పార్లమెంట్ ఎన్నికల సన్నాక సమావేశంలో సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు, యాదాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ,రాష్ట్ర నాయకులు కంచర్ల రామకృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ ఎంపీపీలు జడ్పిటిసిలు జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య జిల్లా నాయకులు గుడ్ల వెంకన్న  గుండ గాని రాములు గౌడ్   రజాక్ రఘునందన్ రెడ్డి పాటు పలువురు టిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు