ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలి - షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి

ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలి - షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి

ముద్ర, షాద్‌నగర్ : ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని  షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి కోరారు.శాంతి భద్రత ల విషయం లో అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బంది కి సూచించారు.

ఈ నెల 18 వ తేదిన ప్రారంభమై 28 వ తేది వరకు కొనసాగే గణేష్ ఉత్సవాల నేపద్యంలో శుక్రవారం  రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లోని బుగ్గరెడ్డి గార్డెన్ లో  స్థానిక ఇన్స్పెక్టర్ ప్రతాప్ లింగం అధ్యర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, మత పెద్దలుతో  శాంతి సమావేశం ఏర్పాటు చేశారు.

 ఈ సందర్బంగా షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి మాట్లాడుతూ గణేష్ వేడుకలను నిర్వీగ్నంగా, ఘనంగా, గౌరవప్రదంగా జరుపుకోవాలని తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులు కమిటీ వివరాలు, మండపాల భాద్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపం లో ఏర్పాటు చేయాలనీ అన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలని అన్నారు. డీజే లకు అనుమతి లేదని వాటిని ఏర్పాటు చేయరాదని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని మతాలకు చెందిన పండుగలు వేడుకలు కార్యక్రమాలు అన్ని సాఫిగా జరిగాయాని ఈ సారి గణేష్ నిమజ్జనం, మరియు మీలాద్ ఉన్ నబి ఒకేరోజున వచ్చే అవకాశం ఉన్నందున వేడుకలను ఎక్కడ ఎలాంటి అవంచానియ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణం లో జరుపుకోవాలని అన్నారు. శాంతి భద్రత ల విషయం లో అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బంది కి సూచించారు. సీసీ టీవీ లపై ప్రత్యేక ద్రుష్టి సరించాలన్నారు. వినాయక మండపాల వద్ద ఎటువంటి సమస్యలు ఘర్షణలు జరిగిన వెంటనే పోలీస్ శాఖ కు తెలియజేయాలనీ సూచించారు. దీనికి ప్రజల సహకారం ఉండాలని కోరారు. 

ఈ శాంతి సమావేశం కార్యక్రమం లో ఏసీపీ రంగస్వామి,ఇన్స్పెక్టర్ ప్రతాప్ లింగం, రాంరెడ్డి, రూరల్ ఇన్స్పెక్టర్ లక్ష్మారెడ్డి,ఎస్సై లు దేవకీ,శరత్, నయీమ్,రవీందర్ నాయక్,మున్సిపల్ కమీషనర్ వెంకన్న బాబు, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, బండారి రమేష్, సయ్యద్ ఇబ్రహీం, నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అల్తాఫ్ హుస్సేన్, రబ్ జామి, అందె బాబయ్య,విశ్వం,జమృద్ ఖాన్, గౌస్ జానీ,అనంతయ్య, శ్రీనివాస్, యుగంధర్, నందకిశోర్,నడికుడ రఘునాథ్ యాదవ్,  చెట్ల వెంకటేష్, ఋషికేష్  తదితరులు పాల్గొన్నారు.