కౌన్సిల్ సాధారణ సమావేశం

కౌన్సిల్ సాధారణ సమావేశం

రామకృష్ణాపూర్,ముద్ర: క్యాతన్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ జంగం కళ అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కౌన్సిల్ సభ్యులు అమరవీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ సమావేశంలో నాలుగు అంశాలతో కూడిన టేబుల్ అజెండాను కమిషనర్ వెంకటనారాయణ కౌన్సిల్ సభ్యులకు చదివి వినిపించారు . ప్రవేశపెట్టిన నాలుగు అంశాలను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎజెండాలోని అంశాలు కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు రెండు జతల దుస్తులకు అయ్యే ఖర్చు లక్ష రూపాయలు, దుస్తుల కుట్టించెందుకు ఎనభైవేలు,గవర్నమెంట్ ప్లీడర్ లీగల్ ఫీజు 22,500/- తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మున్సిపాలిటీలో నిర్వహించిన కార్యక్రమాలకు 3,71,104/- రూపాయలను చెల్లించేందుకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో మేనేజర్ నాగరాజు,ఆర్.ఓ కృష్ణ ప్రసాద్, ఏఈ అచ్యుత్, సానిటరీ ఇన్స్పెక్టర్ వసంత్ తదితరులు పాల్గొన్నారు.