పాలిసెట్ లో 26వ ర్యాంక్ సాధించిన అమన్

పాలిసెట్ లో 26వ ర్యాంక్ సాధించిన అమన్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇటీవల నిర్వహించిన పాలీసెట్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఇందులో నిర్మల్ పట్టణం శ్రీనగర్ కాలనీ కి చెందిన ఎస్ కే అమన్ గణిత విభాగంలో 26 వ రాంక్ సాధించాడు. ఈయన తండ్రి షేక్ హుస్సేన్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా తల్లి గృహిణి. అమన్ రాంక్ సాధించటం ఎంతో ఆనందంగా ఉందని కుటుంబ సభ్యులు అన్నారు.