ఐకేపి సిబ్బంది సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి - సిఐటియు జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ 

ఐకేపి సిబ్బంది సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి  - సిఐటియు జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ 

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా క్రాంతి పథం లో పని చేస్తున్న17 వేల మంది ప్రారంభించే నిరవధిక సమ్మె కి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ అన్నారు.  తమ సమస్యల సాధనకై ఐ కే పి సిబ్బంది చేస్తున్న రిలే దీక్షా శిబిరంలో గురువారం ఆయన మాట్లాడుతూ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుందన్నారు. వివోఏలు క్షేత్ర స్థాయిలో డ్వాక్రా మహిళా గ్రూపుల ఏర్పాటు,వాటి బలోపేతం,ఆర్థికంగా ఎదుగుదల వంటి వాటిలో కీలక పాత్ర పోషిస్తుంటే,వీరికి కేవలం రూ.3900 మాత్రమే గౌరవ వేతనం ఇస్తున్నారన్నారు. రోజు రోజుకు పని భారం పెరుగుతూ,తీవ్రమైన రాజకీయ ఒత్తిడులకు గురవుతున్నారన్నారు.పి ఎఫ్, ఇ ఎస్ ఐ,  ప్రమాద భీమా వంటి  సౌకర్యాలు ఏమీ లేకుండా అభద్రతతో బతుకులు ఈడుస్తున్నారన్నారు.గుర్తింపు కార్డులు కూడా ఇవ్వలేదని,బ్యాంక్ లింకేజిలు,8 రకాల ఆన్ లైన్ సేవలు చేయడం,ప్రభుత్వం నుండి ఏ సర్వే వచ్చినా,కాదనకుండా ఆ సర్వే చేసినా ప్రభుత్వం దృష్టిలో కనీస గుర్తింపు కూడా లేదన్నారు.గ్రామ సంఘం గ్రేడింగ్ తో సంబంధం లేకుండా ప్రతీ నెల వేతనాలు వ్యక్తిగత ఖాతాకు చెల్లించాలని,అర్హులైన   వారికి సిసి లుగా పదోన్నతులు ఇవ్వాలని, జాబ్ చార్ట్ తో సంబంధం లేని పనులతో సహా ఇతర పనుల్ని చేయించరాదని సురేష్  డిమాండ్ చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని,ఆన్ లైన్ సేవలు ఆపేసినా పట్టించుకోలేదని, ప్రభుత్వం వివో ల సమస్య పటీపట్టినట్టు సంస్థ తల్లి ప్రేమ చూపిస్తున్నట్టు వ్యవహరిస్తుంది కావున రాష్ట్రవ్యాప్తంగా ఐకెపి వివోఏలు నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి  సమస్యలు పరిష్కరించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని CITU నిర్మల్ జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ,లేనిపక్షంలో  ఈ కార్యక్రమంలో తెలంగాణ  విఓఏ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సాయన్న, నిర్మల్ రూరల్ అధ్యక్షురాలు గాయత్రి, హిందూజా గోదావరి పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.