గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి.

గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి.
  • క్రీడలతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది..ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ 

ముద్ర, వేములవాడ :గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలి అని, యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి అని, అదే స్ఫూర్తి నిజ జీవితంలో అలవర్చుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని  అయోధ్యలో ఈనెల  5 నుంచి 7 వరకు జరిగే ఇంటర్నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ కు ఎంపికైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాకారులను సాగినంపేందుకు ఏర్పాటుచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ జండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నేటి యువత చేతిలో ఉందని చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దు  అని అన్నారు. జిల్లాలో మాస్టర్ అథ్లెట్స్ అంతర్జాతీయ  క్రీడల్లో పాలుపంచుకోవడం అభినందనీయం అని,క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతి  ఒక్కరు  కృషి  చేయాలి  అని అన్నారు.క్రీడలలో పాల్గొనడం వల్ల శారీరకంగా,ఆరోగ్యం గా దృడంగా ఉండడంతో పాటు మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారని అన్నారు.నిజ జీవితంలో సమిష్టి కృషి తోనే విజయాలను సులువుగా చేరుకోగలమనే దానికి ఉదాహరణ క్రీడలని అన్నారు. క్రీడ ఓటమి చెందిన వారు తమ లోపాలను సవరించుకొని  ముందుకు వెళ్లడం అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, నాయకులు అన్నారం శ్రీనివాస్ మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.