రామకృష్ణాపూర్, ముద్ర : పట్టణంలోని సెయింట్ జాన్స్ హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలను బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు,ట్రస్మా జిల్లా అధ్యక్షుడు దామెర్ల సిద్దయ్య,పాఠశాల ప్రిన్సిపల్ పొన్నాల సుమన్,డైరెక్టర్ పొన్నాల వినయ్,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.