ఘనంగా బక్రీద్ వేడుకలు

ఘనంగా బక్రీద్ వేడుకలు

ముద్ర, మల్యాల:-బక్రీద్ పండుగ వేడుకలు గురువారం మల్యాల మండలంలో ముస్లీoలు ఘనంగా జరుపుకున్నారు. మల్యాల బ్లాక్ చౌరస్తా, రామన్నపేటలో గల ఈద్గాల వద్ద ఉదయం మండలంలోని ముస్లీo సోదరులు సామూహిక ప్రార్ధనలు చేశారు. అనంతరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు ముస్లీoలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.