బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకై కృషి 

బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకై కృషి 
  • అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు ముల్కళ్ల రాందాస్

ముద్ర, లక్షెట్టిపేట : సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు ముల్కళ్ల రాందాస్ కోరారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 37వ జయంతిని వేడుకలు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా అయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాందాస్ మాట్లాడుతూ 50 సంవత్సరాలు ఏకదాటిగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్న మహనీయుడన్నారు. బహుజన జాతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేశాడన్నారు. సమాజంలో అనేక రుగ్మతలు రూపుమాపడానికి అనేక పోరాటాలు నిర్వహించరన్నారు. ఈ కార్యక్రమంలో శనిగారపు లింగన్న, అవునూరి లచ్చన్న, దమ్మ నారాయణ, బైరం రవి, కౌన్సిలర్ చాతరాజు రాజన్న, గుత్తికొండ శ్రీధర్, పెండెం రాజశేఖర్, వేముల ప్రేమ్ సాగర్, సామనపల్లి కిషన్, అల్లంపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.