తాండూరులో ఘనంగా దసరా ఉత్సవాలు

తాండూరులో ఘనంగా దసరా ఉత్సవాలు

పాల్గొన్న మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి,వికారాబాద్ : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో దసరా పండుగ వేడుకలు సోమ వారం రాత్రి ఘనంగా నిర్వహించారు. పట్టణంలో కేరింతల మధ్య రావణ దహనం కార్య క్రమం నిర్వహించారు.
శమీ వృక్షం వద్ద  మంత్రి మహేందర్ రెడ్డి తో పాటు   ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి లు పూజలు నిర్వహించారు. అలాగే పట్టణం లోని పాత తాండూరు లోని భవానీ మాత ఆలయం లో ( బోనమ్మ గుడిలో )ప్రత్యేక పూజలు చేసిన ఆనంతరం మంత్రి, ఎమ్మెల్యే లు ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు .ప్రజలు శుభిక్షంగా ఉండాలని ప్రార్టించినట్లు మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు.

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గం లో రెండేళ్ల లోనే రూ.1679 కోట్లు మంజూరు చేసి తాండూరును అభివృద్ధి చేసినట్లు తెలిపారు.రానున్న రోజుల్లో 
మరింత అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. హిందూ ఉత్సవ సమితికి తన పూర్తి సహకారం ఉంటుందని ఈ సంద్భంగా  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ ఛైర్పర్సన్ స్వప్న పరిమల్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారి, కౌన్సిలర్లు శోభారాణి, బీ ఆర్ఎస్ నాయకులు కరణం పురుషోత్తం రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్, వెంకటరెడ్డి , బిట్కర్ రఘు తదితరులు పాల్గొన్నారు.