కొలువుదీరిన  శ్రీ దుర్గా మాత విగ్రహాలు 

కొలువుదీరిన  శ్రీ దుర్గా మాత విగ్రహాలు 

ముద్ర: ఎల్లారెడ్డిపేట:ఎల్లారెడ్డిపేట మండలం లో శ్రీ దుర్గామాత నవరాత్రోవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.మండలంలోని అన్ని గ్రామాలతో పాటు చూడ ముచ్చట గా  రంగురంగుల విద్యుత్  దీపాలతో   మంటపాలను  అలంకరించి  ఎల్లారెడ్డిపేట  పట్టణంలోని సద్ది మద్దుల రెడ్డి సంక్షేమ సంఘం భవనంలో శ్రీ దుర్గా మాత యూత్ అసోసియేషన్ వారు 21 వార్షికోత్సవం ఎడ్ల అంగడి ఏరియాలో శ్రీ దుర్గా మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఐదో వార్షికోత్సవం , మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మూడో వార్షికోత్సవం సందర్భంగా శ్రీ దుర్గా మాత విగ్రహాలను  నవరాత్రి ఉత్సవాల సందర్భంగా  ఏర్పాటు చేసి  గ్రామ పురోహితులు రాచర్ల దయానంద్ శర్మ , కృష్ణ మూర్తి శర్మ లు ఘనంగా పూజాకార్యక్రమాలు నిర్వహించారు.ఎల్లారెడ్డిపేట  పట్టణంలో పలువురు ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్దకు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్రెడ్డి , సింగల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి , ఎంపీటీసీ సభ్యురాలు పందిళ్ల నాగరాణి  పరిశ్రమలు గౌడ్ , ఎలగందుల అనసూయ నర్సింలు , బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి , మహిళా మండల అధ్యక్షురాలు అప్సరా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మీసం రాజం,మెగి నరసయ్య  నందికిషన్, బాద్ రమేష్ అజ్జు బాయి , గంట వెంకటేష్ గౌడ్  , బిజెపి పార్టీ నాయకులు గుండాడి వెంకట్ రెడ్డి , పారిపెల్లి రాంరెడ్డి, , యమగొండ కృష్ణారెడ్డి, రాంరెడ్డి ఆయా అసోసియేషన్  సభ్యులు స్థానిక నాయకులతో కలిసి శ్రీ దుర్గా మాత ను దర్శించుకున్నారు.శ్రీ మార్కండేయ మందిరం లో శ్రీ దుర్గామాత విగ్రహాలకు  ఆలయపూజారి ఉమాశంకర్ ప్రత్యేక పూజలు చేసిన  అనంతరం  వారి వారి మంటపాలకు ప్రత్యేకంగా అలంకరించిన  ట్రాక్టర్ లలో విగ్రహలను డిజియో పాటలతో మహిళల  కోలాటాలతో శోభాయాత్ర సాగింది .ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధ్దలతో ఉత్సవాలను నిర్వహించారు.