ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
  • జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు

రామకృష్ణాపూర్,ముద్ర: పట్టణంలో 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని  పురస్కరించుకుని మంగళవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏర్పాటు చేసిన ప్రత్యేక జెండా ఆవిష్కరణ కార్యక్రమలలో అధికారులు,ప్రజా ప్రతినిదులు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్బంగా క్యాతన పల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యా సాగర్,మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు.ఆర్కేపి పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ బీ.అశోక్ పోలీస్ సిబ్బందితో కలిసి జెండాను ఆవిష్కరించారు. పట్టణ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్,పార్టీ ఇంచార్జ్ సమ్మయ్య పార్టీ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. పట్టణ బిజెపి పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను పట్టణ అధ్యక్షుడు మహంకాళి శ్రీనివాస్ ఎగురవేశారు. బిజెపి పార్టీ అధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాలతో పుర వీధులలో బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలుగు దేశం,కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. సింగరేణి వ్యాప్తంగా వివిధ గనులు,డిపార్ట్మెంట్లలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు,ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..