ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవ సంబరాలు - త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవ సంబరాలు - త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కొంగరకలాన్ లో ఆదివారం సమైక్యత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు.

ఈ వేడుకల్లో  ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి,  మహేశ్వరం డిసిపి సిహెచ్ శ్రీనివాస్, ఎసిపి శ్రీనివాస్, జిల్లా రెవిన్యూ అధికారి సంగీత, కలెక్టరేట్ ఏ.ఓ. ప్రమీల రాణి, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.