భక్తి శ్రద్ధలతో రంజాన్ పర్వదిన వేడుకలు...

భక్తి శ్రద్ధలతో రంజాన్ పర్వదిన వేడుకలు...
  • రంగారెడ్డి జిల్లాలో ఘనంగా రంజాన్ ఈదుల్ ఫితర్ పండుగ 
  • ఈద్గాల వద్దకు రాజకీయ నాయకులు చేరుకొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

*షాద్ నగర్, ముద్ర: పవిత్ర రంజాన్ పర్వదిన వేడుకలు భక్తిశ్రద్ధలతో గురువారం రంగారెడ్డి జిల్లాలో రంజాన్ పర్వదిన వేడుకలు ముస్లిం సోదరులు కన్నుల పండుగ సమీపంలో ఉన్న ఈద్గా ల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గాల వద్ద రంజాన్ ఈదుల్ ఫితర్ ప్రార్ధనలకు ముస్లింలు చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా పెద్ద సంఖ్యలో ఈద్గా వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేలాదిమంది ముస్లిం సోదరులు ప్రార్థనలకు హాజరయ్యారు. నమాజ్ అనంతరం ఒకరికొకరు ఆ లింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వివిధ పార్టీల రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ఈద్గా వద్దకు తరలివచ్చి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యేలు చౌలపల్లి ప్రతాపరెడ్డి, భీష్మ కిష్టయ్య, మున్సిపల్ చైర్మన్ నరేందర్, మాజీ చైర్మన్ విశ్వం, ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డిలు ముస్లింలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు రంజాన్ పవిత్రత విశిష్టత గురించి చర్చించారు. ముస్లిం మతస్థులకు అత్యంత ముఖ్యమైనది రంజాన్ పండుగ. ముస్లింలు నెలపాటు నియమాలతో కూడిన కఠినమైన ఉపవాస దీక్షలు చేపట్టి ఈ నెలలో వారు అధికంగా దానధర్మాలు చేస్తారని కొనియాడారు.

రంజాన్ మాసంలో చేసే దానాలకు అధిక ప్రాముఖ్యత ఉందని ఈ దానాల్లో రెండు రకాలున్నాయనీ జకాత్, ఫిత్రా. జకాత్ అంటే ముస్లిం మతస్థులు తమ సాంవత్సరిక ఆదాయం, ధనంలో కొంత శాతం డబ్బు అవసరమున్న, పేదవారికి సాయం చేయాలనీ ఈ జకాత్‌ను రంజాన్ నెలలో లెక్కగట్టి చెల్లిస్తారని వారు పేర్కొన్నారు. ఫిత్రా దానధర్మాలు ఫిత్రా ధార్మిక విధానం కింద అభాగ్యులకు, పేదవారికి దానం చేస్తారనీ తిండి, బట్టలకు నోచుకోని వారికి వీరు సాయం చేస్తారనీ దేవుడు తమకిచ్చిన జీవితం, సుఖసంతోషాలకు కృతజ్ఞతగా ముస్లిం సోదరులు లేనివారికి ఈ దానం చేస్తారన్నారు. ఈ ఫిత్రాదానంలో గోధుమలు కానీ, ఆహారధాన్యములు కానీ, ధనాన్ని కానీ పంచిపెడతారు. ఈ దానం కుటుంబ సభ్యుల తరఫున ఇంటిపెద్ద చేస్తారు. ఈ దానాల ద్వారా బంధాల నుంచి విముక్తి చెంది అల్లాను చేరుకుంటామని ఇస్లాం మతస్థుల విశ్వాసం. జీవితంలో చేసిన చెడు తలంపులు, పలికిన అసత్యాలు, చేసిన పాపాలు రంజాన్ నెల దానధర్మాల ద్వారా నశించిపోతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్ నగర్ తదితర నియోజకవర్గాల్లో రంజాన్ పర్వదిన వేడుకలను ముస్లింలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించుకున్నారు. రంజాన్ పర్వదిన వేడుకల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రతిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల రాజకీయ నాయకులతో పాటు ముస్లింలు పాల్గొన్నారు.