గృహలక్ష్మి పథకాన్ని పార్టీలకు అతీతీతంగా ఇవ్వాలి

గృహలక్ష్మి పథకాన్ని పార్టీలకు అతీతీతంగా ఇవ్వాలి
  • సొంత పార్టీ వారికే వచ్చే విధంగా పేర్ల మార్పిడి
  • 3 వ వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి

హుజూర్ నగర్ టౌన్ ముద్ర: గృహలక్ష్మి పథకాన్ని పార్టీలకు అతీతంగా ఇవ్వాలని, అందులో జరుగుతున్న అవకతను వెంటనే సవరించాలని 3 వ వార్డు కౌన్సిలర్ కోతిసంపతి రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో 1200 మంది గృహలక్ష్మి పథకానికి అప్లై చేయగా అందులో పార్టీలకు అతీతంగా అర్హులను కేటాయించాలని, కానీ బీహార్ ఎస్ నాయకులు కేవలం బిఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల పేర్లను మంగళవారం రాత్రి మున్సిపాలిటీలో పేర్ల మార్పిడి చేసి కలర్ కలెక్టర్ కి పంపిస్తున్నారని, ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ సత్య నారాయణ కు ఫిర్యాదు చేశారు.