ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి

ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం లో బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బుధవారం కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో కలెక్టర్ సంతోష్, ఐఏఎస్ అధికారి గౌతమి, ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.