నేడు చెన్నూర్ నియోజకవర్గంకు హరీష్ రావు రాక.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి

నేడు చెన్నూర్ నియోజకవర్గంకు హరీష్ రావు రాక..  అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు బుధవారం చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 
చెన్నూర్, జైపూర్, భీమారం మండలాల్లో మంత్రి పర్యటన ఖరారు అయ్యింది. 200 కోట్ల రూపాయల తో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన లో మంత్రి పాల్గొంటారు. 
చెన్నూర్ లో 21 కోట్ల 70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రికి మంత్రి శంఖుస్థాపన చేయనున్నారు. బస్ డిపో ఏర్పాటు కు శంఖుస్థాపన చేస్తారు. అభివృద్ధి కార్యక్రమాలు తో పాటు చెన్నూర్ మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారంలో హరీష్ రావు పాల్గొంటారు. ఈమేరకు చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంత్రి పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు