ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డుల అందజేత - వెంకటాపూర్ గ్రామపంచాయతి కార్యాలయంలో : బీజేపి 

ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డుల అందజేత - వెంకటాపూర్ గ్రామపంచాయతి కార్యాలయంలో : బీజేపి 

ముద్ర,ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి  ఆధ్వర్యంలో స్థానిక గ్రామపంచాయతీలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను మంగళవారం అందజేశారు. అనంతరం పొన్నాల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ప్రజలందరికీ అందుబాటులో వైద్యం అందాలని ఈ ఆయుష్మాన్ భారత్ ను ప్రవేశపెట్టడం జరిగిందని  గ్రామ ప్రజలందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డులను అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఎల్లారెడ్డిపేట మండలంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేడిశెట్టి బాలయ్య,మల్లారపు మహేష్,గడ్డం రవి, గుర్రాల రాజిరెడ్డి, పావుడాల పూర్ణచందర్,కోల నరసయ్య, తోట రాజేందర్,కార్యదర్శి ఆరేందర్ రెడ్డి,పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు