బీరవెల్లిలో బారులు తీరిన జనం

బీరవెల్లిలో బారులు తీరిన జనం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ నియోజక వర్గం సారంగాపూర్ మండలం బీరవెల్లి లో పోలింగ్ ముగిసే సమయానికి దాదాపు మూడు వందల మంది ఓటర్లు బారులు తీరారు. ఇక్కడ రెండు పోలింగ్ బూతుల్లో 2600 ఓటర్లు ఉండగా సాయంత్రం ఐదు గంటలకు ఇంకా 300 మంది వరుసలో వేచి ఉండడంతో వారికి ఓటర్ స్లిప్పులు ఇచ్చారు.