చంచల్‌గూడ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల దగ్గర హైటెన్షన్...

చంచల్‌గూడ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల దగ్గర హైటెన్షన్...

మూసీ సుందరీకరణ లో భాగంగా ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఎఫ్‌టీఎల్,బఫర్ జోన్ల పరిధిలో ఉన్న ఆక్రమణలను కూల్చివేస్తోంది.అయితే, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూం లు కేటాయిస్తామని సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగా కొందరిని ఇప్పటికే స్థానికంగా ఉన్న డబుల్ బెడ్‌రూం సముదాయాల్లోకి తరలిస్తున్నారు. మరికొందరు నిర్వాసితులను ఇతర ప్రాంతాల్లో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లల్లోకి పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే చెంచల్‌గూడ పరిధిలో ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.తమ కోసం నిర్మించిన డబుల్ ఇళ్లను మూసీ నిర్వాసితులకు కేటాయించడం ఏంటని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంచల్‌గూడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇళ్లు లేని నిరుపేదలు ఉన్నారని.. డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేవలం స్థానికులకు మాత్రమే కేటాయించాని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున స్థానికుల అక్కడికి చేరుకుని నిరసన తెలుపుతుండగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. అయితే, చంచల్‌గూడ డబుల్ ఇళ్లను అధికారులు ఎవరికి కేటాయిస్తారనే సస్పెన్స్ అందరిలోనూ నెలకొంది.