సామెల్ ను గెలిపించాలని ఇంటింటా ప్రచారం

సామెల్ ను గెలిపించాలని ఇంటింటా ప్రచారం

మోత్కూర్(ముద్ర న్యూస్): మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ఆరవ వార్డు 11 బూత్ ఆరెగూడెంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామేల్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు గడపగడపకి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఆరు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల  సామేల్ చేయి గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బద్దం నాగార్జున రెడ్డి ,దేవరపల్లి రంగారెడ్డి కొణతం భిక్షం రెడ్డి ,కొనతం దామోదర్ రెడ్డి , శ్యామల భీమ్ రెడ్డి ,కొనతం రాంరెడ్డి,కొనతం మహేందర్ రెడ్డి, వెంగళ సాయి రెడ్డి, దామరోజు నవీన్ చారి తదితరులు పాల్గొన్నారు.