అంగరంగ వైభవంగా పానుగల్ ఈదమ్మ జాతర ఉత్సవాలు

అంగరంగ వైభవంగా పానుగల్ ఈదమ్మ జాతర ఉత్సవాలు
  • షిడే ఉత్సవాలకు పోటెత్తిన భక్తజనం
  • షిడే కు మేక పిల్లను కట్టి గుడి చుట్టూ ప్రదక్షిణలు
  • అమ్మవారిని దర్శించుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి 

ముద్ర,పానుగల్:- పానుగల్ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఈదమ్మ జాతర షిడే ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. షిడే కు మేక పిల్లను కట్టి గుడి చుట్టూ ప్రదక్షణలు చేశారు.ఈదమ్మ జాతర ఉత్సవాలకు ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.సమీప గ్రామాల ప్రజలు బోనాలు నెత్తిన పెట్టుకొని ఈదమ్మ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారి మొక్కులను తీర్చుకున్నారు.పూజారి నాగన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు,వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి,సీనియర్ నాయకులు డాక్టర్ పగిడాల శ్రీనివాస్ ఉత్సవాలకు హాజరై మొక్కులు తీర్చుకున్నారు.

జాతరలో తినుబండారాల షాపులు అడుకునేందుకు ఆట వస్తువుల బొమ్మల షాపులు అధికంగా వెలిశాయి..రంగుల రాట్నం,, ఏక్సిబిషన్,,తదితర వాటిని ఏర్పాటు చేశారు...భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగు నీటి సౌకర్యంను గ్రామ పంచాయితీ అధ్వర్యంలో అధికారులు ఏర్పాటు చేశారు.వివిధ పార్టీల నాయకులు,,గ్రామాల ప్రజాప్రతినిధులు తదితరులు షిడే ఉత్సవాలను తిలకించారు.జాతరలో భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా,ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సీఐ నాగ భూషణ రావు, స్థానిక ఎస్ఐ వేణు తో పాటు 8 మంది ఎస్ఐ లు,50 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఎంపీపీ మామిల్లపల్లి శ్రీధర్ రెడ్డి,మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు,జెడ్పీటీసీ రవి కుమార్,సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ భాస్కర్ యాదవ్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు రాము యాదవ్,బ్రహ్మం,,వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు,అధికారులు,పార్టీల నాయకులు పాల్గొన్నారు.