హనుమకొండ కేటీఆర్‌ పర్యటనకు భారీ ఏర్పాట్లు.. అధికారులతో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్

హనుమకొండ కేటీఆర్‌ పర్యటనకు భారీ ఏర్పాట్లు.. అధికారులతో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్

రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ వచ్చే నెల ఆరవ తేదీన హనుమకొండ లో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అధికారులను ఆదేశించారు.
 మంగళవారం  కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు మంత్రి పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ.. కేటీఆర్‌ హనుమకొండ వరంగల్ పట్టణంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు. ఆయన శాఖల అధికారులు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పరిశీలించి ప్రారంభోత్సవం శంకుస్థాపనలకు సిద్ధం చేయాలన్నారు.
ఇటీవల వరద నష్టం కు ప్రభుత్వం కేటాయించిన నిధులతో చేపట్టిన పనులు, స్మార్ట్ సిటీ పనులు, కూడ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, gwmc పరిధిలో చేపట్టిన పనులు ప్రరోంభంత్సవాలు, సంక్షేమ కార్యక్రమాల లో లబ్ధిదారులతో సమావేశం ఉంటుంది అని అన్నారు. బందోబస్త్ పక్కాగా చేపట్టాలని అన్నారు.పలు ప్రారంభోత్సవాలు చేపట్టనున్నట్లు తెలిపారు.హెలిపాడ్, సభా స్తలి పై ప్రత్యేక ద్రుష్టి సరించాలని అన్నారు.

ఈ సమావేశం కూడ చైర్మన్ సౌందర్ రాజన్,లో సీపీ రంగనాధ్, కలెక్టర్ సిక్త పట్నాయక్, జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు.