ఆలయంలో భక్తుల ప్రదక్షిణలు
ముద్ర, కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఆదివారము భక్తుల తాకిడితో కలకలలాడింది. కార్తీక మాసంలో వచ్చే తిరునక్షత్రంను శ్రీవేంకటేశ్వర స్వామి పుట్టినరోజుగా పరిగనిస్తారు. పుట్టిన రోజు సందర్బంగా ఆలయంలో స్వామి వారికి అర్చన, అభిషేకాలు, సుదర్శన యాగం, గోపూజలను ఆలయ పూజారి బీర్నంది నరసింహాచారి అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూజానoతరం పూజారి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. పుట్టినరోజు పురస్కరించుకొని ఆలయంలో నూటెనిమిది ప్రదక్షణలు చేస్తే అంత మంచి జరుగుతుందని అర్చకులు భక్తులకు వివరించారు..