భార్యను హత్య చేసిన భర్త అరెస్టు

భార్యను హత్య చేసిన భర్త అరెస్టు

గొడ్డలితో హత్య చేసిన భర్త 
రామకృష్ణాపూర్,ముద్ర: భార్యాభర్తల మధ్య డబ్బుల విషయంలో జరిగిన గొడవ హత్యకు దారి తీసింది.కట్టుకున్న భర్తే భార్యను గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. బుధవారం రాత్రి సుమారుగా ఎనిమిది గంటల ప్రాంతంలో రామకృష్ణాపూర్ పట్టణంలోని గంగా కాలనీలో జరిగిన విషాద సంఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. ఈ మేరకు గురువారం ఆర్కేపి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి హత్య కేసు కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మృతురాలు మల్లమ్మ కోడలితో కలిసి గంగ కాలనీలో నివాసం ఉంటుంది. భర్త  అన్నేడి @ లక్కాకుల లచ్చిరెడ్డి సింగరేణిలో పనిచేసి పదవీ విరమణ పొందిన అప్పటినుంచి భార్య మల్లమ్మ సంసారాన్ని నడిపించేది. పదవి విరమణ పొందిన డబ్బులు, ఊరిలో పొలం కౌలుకిచ్చిన డబ్బులు మొత్తం మల్లమ్మ దగ్గరే ఉన్నాయనే కారణంతో తరచూ గొడవలు జరిగేవి.

 ఇదే క్రమంలో బుధవారం రాత్రి జరిగిన గొడవలో భర్త లచ్చిరెడ్డి భార్య మల్లమ్మ (65) ను గొడ్డలితో దాడి చేసి హత్య చేశారు. గమనించిన చుట్టుపక్కల వాళ్ళు స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యలు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు.అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మల్లమ్మ మృతి చెందినట్లుగా నిర్ధారించారు. కోడలు మంజుల ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఆర్కేపి పట్టణంలోని క్రీడా మైదానంలో లచ్చిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ చేసినట్లు సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ కేసును చేదించిన మందమర్రి సీఐ మహేందర్ రెడ్డి, రామకృష్ణాపూర్ ఎస్సై అశోక్, హెడ్ కానిస్టేబుల్ దుర్గాప్రసాద్,రాజమౌళి,గిరిబాబు, అజయ్, కానిస్టేబుళ్లు సంపత్, అనిల్,రవి, హోంగార్డు రమేష్ లను డిసిపి సుధీర్ రామనాథ్ కేకన్ అభినందించారు..