- తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టిఆర్ఎస్ బి ఆర్ ఎస్ శ్రేణులు
తుంగతుర్తి, ముద్ర: సూర్యాపేట శాసన సభ్యులు, మాజీ మంత్రి వర్యులు గుంత కండ్ల జగదీష్ రెడ్డి పై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండావిధించిన అక్రమ సస్పెన్షన్ వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో గురువారం సాయంత్రం దగ్ధం చేశారు.ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ శాసన సభలో మాట్లాడుతున్న సందర్బంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పై సస్పెన్షన్ విధించాడాన్ని బిఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండాగానీ రాములుగౌడ్, గుండాగానీ దుర్గయ్య గాజుల యాదగిరి. గోపగాని శ్రీను అంగోతు నరేష్, గుగులోతు విరోజీ, కొండగడుపుల వెంకటేష్. బొజ్జ సాయి కిరణ్. మల్లేష్. మల్లిఖార్జున్. వెంకన్న తదితరులు పాల్గొన్నారు.