జడ్చర్ల కాంగ్రెస్ లో వర్గ పోరు

జడ్చర్ల కాంగ్రెస్ లో వర్గ పోరు
  • టికెట్ నాకంటే నాకంటూ ప్రచారం
  • ఒక రేవంత్ వర్గం మరొకరు వెంకటరెడ్డి వర్గం

ముద్ర, ప్రతినిధి,మహబూబ్ నగర్ : శాసనసభ ఎన్నికల ఇప్పిస్తున్న వేళ పార్టీలోని నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలి. ఇప్పటికే 9ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్స్ పార్టీని రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియమితులైన తర్వాత పార్టీలోని అన్ని వర్గాలను కలుపుకు పోయేందుకు కృషి చేస్తున్నారు. ఎలాగైనా పార్టీని గట్టెక్కించలని, ఉన్న అన్ని వనరులను ఉపయోగిస్తున్నారు. మరో వైపు సిఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేపట్టి రేవంత్ కు సహకరిస్తున్నారు. ఇ తరుణంలో పార్టీలో క్రమశిక్షణా ఉండి ఎవరికి టికెట్టు ఇచ్చిన అది పార్టీ నిర్ణయంగా భావించి విజయానికి కృషి చేయాల్సిన నాయకులు చెరో దారిలో వెళ్తూ జడ్చర్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నారు.

జడ్చర్ల కాంగ్రెస్ పార్టీలో  సఖ్యత కుభిన్నంగా వర్గపోరు సాగుతుంది. అధిష్టానం టికెట్ నాకంటే నాకేస్తుందని బహిరంగంగా ఇద్దరు నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. అందులో ఒకరు జడ్చర్ల నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఎర్ర శేఖర్, మరొకరు ప్రముఖ పారిశ్రామికవేత్త యువ నాయకుడు జనంపల్లి అనిరుద్ రెడ్డి. గత నెల సిఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క నిర్వహించిన పీపుల్ మార్క్ బహిరంగ సభలో ఈ వర్గ విభేదాలు అయ్యాయి. ఎర్ర శేఖర్ బిజెపి కాంగ్రెస్ లో చేరేటప్పుడు పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టికెట్ పై స్పష్టమైన హామీ ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. దీంతో ఆయన సైలెంట్ గా తన వర్గాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు తన సామాజిక వర్గమైన ముదిరాజు ఓట్లు కూడా ఈ నియోజకవర్గంలో అధికంగా ఉండడం ఆయనకు కలిసి వస్తుంది.  యువ నేత అనిరుద్ రెడ్డి గత కొంతకాలంగా టికెట్ ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను తన సొంత ఖర్చులతో కొనసాగిస్తున్నారు.

పీపుల్ మార్చ్ బహిరంగ సభకు మొత్తం ఖర్చును తానే భరించారు. అతడికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులు బలంగా ఉన్నాయి. బహిరంగ సభలో రేవంత్ రెడ్డి సమయం వచ్చినప్పుడు అనిరుద్ రెడ్డికి టికెట్ కేటాయిస్తారని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి భరోసాతో అని రుద్ రెడ్డి దూసుకు వెళ్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఒకరు మాత్రం రెబల్ గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. దీని దృష్టిలో ఉంచుకొని అధిష్టానం ఇద్దరినీ పక్కన పెట్టి మూడో వ్యక్తికి టికెట్ ఇచ్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంచనాలు వేస్తున్నారు. ఇలా ఉండగా సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ తనకి వస్తుండడంతో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ లో వర్గపు సాగుతున్నడం కలిసి వస్తుందిగా భావిస్తున్నారు. పిసిసి రేవంత్ రెడ్డి మాత్రం టికెట్ విషయంపై ఎవరికి హామీ ఇవ్వలేదని తెలుస్తుంది