రెండుగా చీలిన కమ్మ సంఘం

రెండుగా చీలిన కమ్మ సంఘం

వేర్వేరుగా నందమూరి శతాధిక ఉత్సవాలు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శతాధిక ఉత్సవాల సందర్భంగా కమ్మ సంఘంలో విభేదాలు బహిర్గతమయ్యాయి. వారం రోజుల క్రితం కమ్మ కులస్తులు రెండు సంఘాలుగా విడిపోయారు. ఆదివారం ఎన్ టీ ఆర్ జయంతి వేడుకను వేర్వేరుగా నిర్వహించారు. లక్ష్మీ. టాకీస్ చౌరస్తాలో ని ఎన్ టి ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలిఘటించారు. అనంతరం ఓ సంఘం సభ్యులు మాతా శిశు ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేయగా మరోసంఘం లక్ష్మీ టాకీస్ చౌరస్తా లో అన్న ప్రసాదం పంపిణీ చేశారు. రెండు సంఘాల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ, మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముకేశ్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు.