నాసిరకం పనులపై విచారణ జరపాలి

నాసిరకం పనులపై విచారణ జరపాలి

కమీషనర్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్లు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాలలోని రాష్ట్రీయ రహదారి పై ప్రధాన కూడళ్లలో సర్కిల్ నిర్మాణాలు నాసిరకంగా జరుగుతున్నాయని కాంగ్రెస్ కౌన్సిలర్ లు ఆరోపించారు. ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు ఉప్పలయ్య, ఉప నాయకులు వేములపల్లి సంజీవ్, మజీద్ మీడియా తో మాట్లాడుతూ, మున్సిపల్ నిధులతో నిర్మిస్తున్న సర్కిల్స్ నాణ్యత సన్నగిల్లిందని అన్నారు.

అంతే కాకుండా సర్కిల్ వెడల్పు ఎక్కువగా ఉండడం, రోడ్డు చిన్నగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. అధికారుల తప్పిదం వహదారులకు శాపంగా మారిందని విమర్శించారు. హమాలివాడలో 60 ఫీట్లకు రహదారి విస్తరణ చేయవలసి ఉండగా బీఆరెస్ నేతకు నష్టం వాటిల్లకుండా 55 ఫీట్లకు రోడ్డు విస్తరణ చేశారని తెలిపారు. బీఆరెస్ ఫ్లెక్సీలు, బ్యానర్లు రహదారుల డివైడర్లు మధ్యలో విచ్చల విడిగా ఏర్పాటు చేయడం వల్ల వాహనదారులకు ఇబ్బందిగా మారిందని అన్నారు. మున్సిపల్ అధికారులను ఫ్లెక్సీలు తొలగించాలని కోరినప్పటికీ అధికార పార్టీకి వంతపాడుతూ తొలగించడం లేదని ఆరోపించారు.

పోటీ పరీక్షలకు సిద్ధపడుతు గ్రంధాలయంలో చదువుకుంటున్న నిరుద్యోగ యువతి, యువకులకు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఉచిత భోజన వసతిని గాంధీ పార్కులో ఏర్పాటు చేస్తే బీఆరెస్ నేతలు అక్కసుతో గేటుకు తాళం వేయించారని విమర్శించారు. నిరుద్యోగుల సౌకర్యం కోసం  గాంధీ పార్కు గేటు ఓపెన్ చేయాలని కమీషనర్ కు విజ్ఞాప్తి చేశారు. కమీషనర్ ను కలిసిన వారిలో కాంగ్రెస్ కౌన్సిలర్ లతో పాటు పార్టీ నాయకులు ఉన్నారు.