శాంతి, సహనాలకు ప్రతీక క్రిస్మస్

శాంతి, సహనాలకు ప్రతీక క్రిస్మస్
  • మహోన్నత క్షమాగుణ సంపన్నుడు ఏసుక్రీస్తు
  • త్యాగం, క్షమాగుణం, ఓర్పులే ఆయన బోధనలు
  • తెలంగాణలో అభివృద్ధి, ప్రశాంతత, ఐక్యతను పెంచిన ఘనత కేసీఆర్ దే
  • మూడోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు
  • సూర్యాపేటను మరింత అభివృద్ధిపధంలో నడుపుకుందాం
  • ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి


ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-పేటలో పలు చర్చిలో ప్రార్థనలలో పాల్గొని, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

శాంతి, సహనాలకు క్రిస్మస్ ప్రతీక అని.. ఏసుక్రీస్తు మహోన్నత క్షమా గుణసంపన్నుడని సూర్యపేట శాసనసభ్యులు, మాజీమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు. తన దేహానికి శీలలు కొడుతున్న వారిని కుడా క్షమించండి అంటూ వేడుకున్న దయార్ద్ర హృదయుడని.. అటువంటి మహనీయుల బోధనలు ఆచరనీయమని ఆయన పేర్కొన్నారు. సోమవారం క్రిష్మస్ పర్వదినం సందర్బంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్ లో గల సిల్వి సిలోయం చర్చ్, రాజీవ్ నగర్ లో గల గ్రెస్ చర్చ్, శ్రీరామ్ నగర్ లో గల మన్నా చర్చ్, చర్చి కాంపౌండ్ లో గల సెయింట్ బాప్టిస్ట్ చర్చ్ లలో ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొని, కేక్ కట్ చేసి.. నూతన క్యాలెండర్ లను ఆవిష్కరించి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమస్త మానవాళి పట్ల ప్రేమ, నిస్సాహాయిల పట్ల జాలి,అవధులు లేని త్యాగం, సడలని ఓర్పు, శత్రువుల పట్ల కుడా క్షమాగుణం కలిగి ఉన్న కరుణా మయుడు ఏసుక్రీస్తు అన్నారు. ఆయన బోధనలు, శాంతి సామరస్యాలను ఇనుమడింప చేస్తామన్నారు. సర్వమతలా సమ్మేళనానికి తెలంగాణా రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత బీ ఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఆయన ముందు చూపుతో తొమ్మిదిన్నరేండ్లు నిరంతర అభివృద్ధి పాలనతో శాంతి సమరస్యలతో ఐక్యతను  పెంపొందించారన్నారు. అన్ని కులమతాల పండుగలు ప్రశాంత వాతావరణంలో కలిసికట్టుగా జరుపుకోవడమే అందుకు నిదర్శనమన్నారు. సూర్యాపేటలో అన్ని కులమతాల ప్రజలు మూడోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించారని.. అందరి నమ్మకాన్ని నిలబెడుతూ సూర్యపేట ను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్థాన్నారు. ఈ వేడుకల్లో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,  రాష్ట్ర  కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, BRS పట్టణ అధ్యక్షకార్యదర్శులు సవరాల సత్యనారాయణ, బూర బాల సైదులు, నాయకులు అనుములపురి రవిబాబు, ఉప్పల ఆనంద్, పూర్ణ శశికాంత్, మద్ది శ్రీనివాస్ యాదవ్, రమా కిరణ్, గుండపునేని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.