- ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దానం.
ముద్ర ప్రతినిధి జడ్చర్ల: మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పై వేసిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని భారాసా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం ఈ సందర్భంగా జడ్చర్ల పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ చేయడం సరికాదని, వెంటనే జగదీశ్వర్ రెడ్డి రెడ్డి పై వేసిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బారాస నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.