నిన్న దహన సంస్కారాలు.. నేడు పిండ ప్రధానం...

నిన్న దహన సంస్కారాలు.. నేడు పిండ ప్రధానం...
  • మల్యాలలో రెండోరోజు బీఆర్ఎస్ నాయకుల నిరసన
  • రేవంత్ రెడ్డికి పిండ ప్రధానo

ముద్ర, మల్యాల: రైతులకు అందించే 24 గంటల విద్యుత్ పట్ల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మండల బీఆర్ఎస్ నాయకులు బుధవారం మల్యాల క్రాస్ రోడ్డు సమీపంలోని సబ్ స్టేషన్ వద్ద రెండో రోజు తమ నిరసన వ్యక్తం చేశారు. కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్ పిలుపు మేరకు రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకులు పిండ ప్రధానo చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాగా, జడ్పీటీసీ రామ్మోహన్ రావు మాట్లాడుతూ...

తానా సభలో రైతులకు మూడు గంటల సమయం సరిపోతుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రైతులే బుద్ది చెబుతారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టిన దాన్ని పూర్తిగా కంప్లిట్ చేయాలనే ఉద్దేశంతో నిన్న దహన సంస్కారాలు, నేడు పిండ ప్రదానం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు జనగాం శ్రీనివాస్, సర్పంచులు మిట్టపల్లి సుదర్శన్, బద్దం తిరుపతిరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు మధుసూదన్ రావు, కొండగట్టు డైరెక్టర్ కొంక నర్షయ్య, నాయకులు అల్లూరి రాజేశ్వర్ రెడ్డి, పోతరాజు శ్రీనివాస్, మారంపల్లి నారాయణ, తిరుపతి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రాకేష్, గణేష్, చందు, తదితరులు పాల్గొన్నారు.