బిఆర్ఎస్ పార్టీ లో చేరిక

బిఆర్ఎస్ పార్టీ లో చేరిక

ముద్ర. వీపనగండ్ల: చిన్నంబాయి మండల పరిధిలోని బేక్కం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత బిఆర్ఎస్ పార్టీ నాయకులు ధారసింగ్ ఉమ్మడి మండలాల బిఆర్ఎస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గోవింద్ శ్రీధర్ రెడ్డి నాయకులు రాజురెడ్డి ఆధ్వర్యంలో కొల్లాపూర్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీరం హర్షవర్దన్ రెడ్డి వారికి పార్టీ పండుగ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.గత నాయకుల పాలనలో బెక్కెం గ్రామానికి ఎటువంటి అభివృద్ధి  జరగలేదని జరుగుతుంది అన్న నమ్మకం కూడా లేదని పార్టీలో చేరిన వారు అన్నారు. గడిచిన ఐదు సంవత్సరాలలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేయించారని, పరువు లేని ఒక ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారని, గ్రామానికి నూతన గ్రామపంచాయతీ. రైతు వేదిక. సీసీ రోడ్లు సైడ్ కాలువల మరమ్మతు, విధ్యుత్ సబ్ స్టేషన్. దళిత బంధు బీసీ బందు వంటి ఎన్నో ప్రభుత్వ పథకాలను ఎమ్మెల్యే వర్ధన్ రెడ్డి అందించారని వారన్నారు. ఎన్నికల్లో  బిఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతామని పార్టీలో చేరిన వారు ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.