ఏసీపి వైఖరికి నిరసనగా జర్నలిస్టుల నిరసన

ఏసీపి వైఖరికి నిరసనగా జర్నలిస్టుల నిరసన

జమ్మికుంట, ముద్ర : అపర భద్రాద్రి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా జర్నలిస్టులకు ఇచ్చిన మీడియా పాసులను అనుమతించకపోగా వాటిని చించివేసిన హుజరాబాద్ ఏసిపి వెంకట్ రెడ్డి వైఖరికి నిరసనగా జర్నలిస్టులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దాదాపు రెండు గంటల పాటు కళ్యాణమంటపం ఎదురుగానే బయటాయించి నిరసన వ్యక్తం చేయగా కాంగ్రెస్ నాయకులు పత్తి కృష్ణారెడ్డి జర్నలిస్టులకు మద్దతుగా నిరసనలో కూర్చున్నారు. ఇల్లంతకుంట కార్యనిర్వాహణాధికారి సుధాకర్ సంతకము చేసి ఇచ్చిన పాసులను అనుమతించకపోగా జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేయడం పట్ల పలువురు నాయకులు స్థానికులు మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ కు తెలుపగా వారిని లోపలికి అనుమతించాలని ఏసీబీకి సూచించారు. చివర్లో అనుమతించడం పట్ల జర్నలిస్టులు లోపలికి వెళ్లకుండా వెనుతిరిగారు. అంతేకాకుండా సామాన్యులపై కూడా పోలీసులు చేయి చేసుకోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు వచ్చే సమయంలో తోపులాట జరిగింది.