సివిల్స్ ర్యాంకర్ శివమారుతిరెడ్డి ని అభినందించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు

సివిల్స్ ర్యాంకర్ శివమారుతిరెడ్డి ని అభినందించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు

కోరుట్ల ముద్ర న్యూస్ :  కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన శివ మారుతి రెడ్డి ఇటీవల వెలువడిన సివిల్స్ ఫలితాల్లో 132వ ర్యాంక్ సాధించినందున శివ మారుతి రెడ్డిని ఆయన ఇంటికి వెళ్ళి శాలువాతో సత్కరించి,స్వీట్లు తినిపించి పుష్పగుచ్చం అందివ్వడం జరిగింది.జువ్వాడి కృష్ణా రావు మాట్లాడుతూ మన శివ మారుతి రెడ్డి అయిలాపూర్ తో పాటుగా కోరుట్ల నియోజక వర్గానికి కూడా వన్నె తెచ్చారని శివ మారుతిరెడ్డి యువతి,యువకులకు ఆదర్శంగా నిలిచారని విధుల్లో చేరిన తర్వాత విధినిర్వహణలో బాధ్యతలు సక్రమంగా నిర్వహించి ఇంకా గొప్ప పేరు,ప్రఖ్యాతలు సంపాదించుకోవలన్ని,ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించడం జరిగింది.ఈ సన్మాన కార్యక్రమంలో కోరుట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొంతం రాజం, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల గంగాధర్,కోరుట్ల మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పన్నాల అంజిరెడ్డి,కాంగ్రెస్ నాయకులు పుల్లా రెడ్డి,తాటికొండ బాబు,పేరుమాండ్ల వేణు,ముక్కెర రాజేష్,గౌరు రేవంత్,నానురి నరేష్,మార్గం రాజేష్,
శ్రవణ్,సురకంటి సతీష్,తొట్ల మహేశ్ లు పాల్గొన్నారు.