మంచిర్యాల లో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

మంచిర్యాల లో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పై ముదిరాజ్ కులస్తులు నిప్పులు చెరిగారు. ముదిరాజ్ లను కించపరిచే వ్యాఖ్యలను నిరసిస్తూ మంచిర్యాల ఐబీ చౌరస్తా లో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా ముదిరాజ్ సంఘం పట్టణ శాఖ అధ్యక్షుడు తూటు శ్రీనివాస్ మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ముదిరాజ్ కులాన్ని అవమనపరిచే విధంగా బూతులు తిట్టడం సబబు కాదని హితవు పలికారు. ఓ జర్నలిస్ట్ విషయంలో ముదిరాజ్ కులాన్ని ప్రస్తావిస్తూ బూతుపురణం విప్పిన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి అనర్హుడని అన్నారు. ముదిరాజ్ కులస్థులతో పెట్టుకుంటే రాజకీయంగా పుట్టగతులు ఉండవని ఆయన హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకుని ముదిరాజ్ కులస్తులకు క్షమాపణలు చెప్పాలని శ్రీనివాస్ సూచించారు.