బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత మున్సిపాలిటీగా కోదాడ

బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత మున్సిపాలిటీగా కోదాడ
  • ఒడిఎఫ్ ప్లస్ మున్సిపాలిటీ గ కోదాడ

ముద్ర ప్రతినిధి , కోదాడ :- బహిరంగ మల , మూత్ర విసర్జన రహిత పట్టణంగా కోదాడ ఎంపికైనట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు . పట్టణంలోని సులభ్ కాంప్లెక్స్ ల ఏర్పాటుతో పాటు ప్రతి ఒక్కరు ఇంట్లోని మరుగుదొడ్డి నిర్మాణం చేసుకునే విధంగా చెయ్యడం వలన కోదాడ మున్సిపాలిటీ ఎంపికైనట్లు ఆయన తెలిపారు . దీని వలన స్పెషల్ ఫండ్స్ వస్తాయని , స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశంలో ఎంపిక చేసిన కొన్ని మున్సిపాలిటీలలో కోదాడ ఒకటని ఆయన అన్నారు . ఒడిఎఫ్ ప్లస్ లో కోదాడ మున్సిపాలిటీ ఎంపిక కావటానికి ప్రధానంగా శానిటరీ ఇన్సపెక్టర్ యాదగిరి,ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ భవాని తో పాటు మున్సిపల్ అధికారులు,సిబ్బంది ,కామాటిల కృషి ఎంతో ఉందని ఆయన కొనియాడారు.మున్ముందు ఇలాంటి అవార్డులు మరిన్ని వచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు .