కొండగట్టులో భక్తుల రద్దీ - అంజన్న తరళివచ్చిన దీక్షపరులు

కొండగట్టులో భక్తుల రద్దీ - అంజన్న తరళివచ్చిన దీక్షపరులు

ముద్ర, మల్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయo మంగళవారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. వేలాది మంది భక్తులు అంజన్నను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలేత్తకుండా ఈఓ వెంకటేష్ చర్యలు తీసుకున్నారు. కాగా, చిన్న, పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్బంగా మాల ధరించిన స్వాములు వివిధ ప్రాంతాల నుంచి అంజన్న దర్శనంకు అధిక సంఖ్యలో తరళివచ్చారు.

ఏఈవోగా శ్రీనివాస్ బాధ్యతలు
 కొండగట్టు ఆలయ ఏఈవోగా బుద్ది శ్రీనివాస్ ను నియమిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేయగా, మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. 6 నెలల క్రితం శ్రీనివాస్ కొండగట్టు నుంచి సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ కి వెళ్లగా, అప్పటి నుంచి పోస్ట్ ఖాళీగా ఉంది. రానున్న జయంతి ఉత్సవాలు, ఆలయంలో పాలనా పరమైన ఇబ్బందుల దృష్ట్యా మళ్ళీ శ్రీనివాస్ని నియమించారు. అలాగే మిగతా ఖాళీ ఉన్న సిబ్బందిని నియమించడానికి తొందర్లోనే కమిషనర్ ఆదేశాలు జారీ చేయనున్నట్లు ఈఓ వెంకటేష్ తెలిపారు.